బాధగా ఉంది.. సింగర్ సునీత భావోద్వేగ పోస్ట్

బాధగా ఉంది.. సింగర్ సునీత భావోద్వేగ పోస్ట్
x

సింగర్ సునీత భావోద్వేగ పోస్ట్

Highlights

ప్రముఖ సింగర్ సునీత భావోద్వేగ పోస్టు చేశారు.

ప్రముఖ సింగర్ సునీత భావోద్వేగ పోస్టు చేశారు. తనకు సంగీతంలో ఓనమాలు నెర్పిన గురువు శ్రీ పెమ్మరాజు సూర్యారావు మరణం బాధ కలిగించిందని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు సింగర్ సునీత.

ఈ సందర్భంగా సింగర్ సునీత. 'శ్రీ పెమ్మరాజు సూర్యారావు గారు .. చిన్నప్పుడు నాకు సరిగమల భిక్ష పెట్టిన నా గురువు.. స్వర్గస్థులయ్యారు. చాలా బాధగా ఉంది. ఇలాంటి మహానీయుల్ని కోల్పోతుంటే' అంటూ ఫేస్ బుక్‌లో ఆయన ఫొటోని షేర్ చేశారు. సునీత, తన 10 ఏళ్ల వయస్సులో, త్యాగరాజ ఆరాధన ఉత్సవలుతో పాటు తన గురువుతో కలిసి పాల్గొన్నారు.

శ్రీ పెమ్మరాజు సూర్యారావు (87) స్వస్థలం మచిలీపట్నం కాగా.. ఆయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. శాస్త్రీయ, కర్ణాటక సంగీతంలో ప్రసిద్ధులు..రాష్ట్ర ప్రభుత్వం సంగీతంలో ఆయన సేవలకు గానూ పలు అవార్డులతో సత్కరించింది. 2006వ సంవత్సరంలో 'సువర్ణ ఘంట కంకనం'. 2012 ఉగాది పురస్కరం, ప్రతిష్టాత్మక 'హంసా అవార్డు'‌లను ఆ‍యన అందుకున్నారు. 2019 అక్టోబర్‌లో సామ గణ లహరి కల్చరల్ ట్రస్ట్ చేత 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు' కూడా అందుకున్నారు. శ్రీ పెమ్మరాజు సూర్యారావు బుధవారం నాడు విజయవాడలో తుదిశ్వాస విడిచారు.





Show Full Article
Print Article
Next Story
More Stories