logo
సినిమా

Bigg Boss 5 - Rahul Sipligunj: వార్ వన్ సైడ్.. సన్నీనే విన్నర్.. నా సపోర్ట్ అతడికే

Singer Rahul Sipligunj Supports to VJ Sunny in Bigg Boss 5 Telugu
X

Bigg Boss 5 - Rahul Sipligunj: వార్ వన్ సైడ్.. సన్నీనే విజేత.. నా సపోర్ట్ అతడికే

Highlights

* రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ లలో తన సపోర్ట్ ఎవరికో చెప్పేశాడు.

Bigg Boss 5 - Rahul Sipligunj: బిగ్‌బాస్ సీజ‌న్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ లలో తన సపోర్ట్ ఎవరికో చెప్పేశాడు. బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం నుండి ఇప్పటివరకు అటు బుల్లితెర ప్రేక్షకులను తన మాటలతో పాటు ఆటలతోనూ ఎంతగానో ఆకట్టుకున్న వీజే స‌న్నీకే తన సపోర్ట్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ విజేత సన్నీనే అవుతాడని అతడి గేమ్ నచ్చే సపోర్ట్ చేస్తున్నానని రాహుల్ తెలిపాడు.

గతంలో అందరూ బాగానే ఆడుతున్నారని చెప్పిన రాహుల్ సిప్లిగంజ్ తాజాగా సన్నీకి సపోర్ట్ చేస్తూ వార్ వన్ సైడ్ అంటూ హార్ట్ సింబల్ తో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. విజే స‌న్నీ ఆట బాగా ఆడుతున్నాడ‌ని, ఎవ‌రికి వారు న‌చ్చిన‌ వాళ్ల‌కు స‌పోర్ట్ చేసుకోవ‌చ్చు అని రాహుల్ సిప్లిగంజ్‌ తెలిపారు. ఇక ఈవారం ఎలిమినేషన్ ఎవరు అవుతారో నేడు తేలనుండటంతో పాటు ఇప్పటికే "టికెట్ టూ ఫినాలే" రేసులో ఫస్ట్ ఫైనలిస్ట్ గా శ్రీరామచంద్ర చేరుకున్నాడు. శనివారం జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్ లో ఉన్న మానస్, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, శ్రీరామచంద్ర, సిరి హనుమంత్ లలో శ్రీరామచంద్ర సేవ్ అవగా.. ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.

Web TitleSinger Rahul Sipligunj Supports to VJ Sunny in Bigg Boss 5 Telugu
Next Story