రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం.. టీడీపీ నేత కుటుంబం నుంచి కాబోయే వధువు

రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం.. టీడీపీ నేత కుటుంబం నుంచి కాబోయే వధువు
x

రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం.. టీడీపీ నేత కుటుంబం నుంచి కాబోయే వధువు

Highlights

ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆదివారం (ఆగస్టు 17) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది.

ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఆదివారం (ఆగస్టు 17) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో ఆయన నిశ్చితార్థం జరిగింది. వధువు హరిణ్య రెడ్డి. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎంగేజ్‌మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హరిణ్య రెడ్డి గురించి వివరాలు బయటకు రాగానే అందరిలో ఆసక్తి పెరిగింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 15 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, రాహుల్ కూడా ఆమెను ఫాలో అవుతున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు.

హరిణ్య రెడ్డికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తెలుగు దేశం పార్టీకి దగ్గరగా ఉన్న కుటుంబానికి చెందినవారు. టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్య. ఈ కుటుంబం మొత్తం నందమూరి బాలకృష్ణకు అత్యంత సన్నిహితంగా ఉంటుందని సమాచారం.

ఈ విషయాన్ని స్వయంగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మా అన్న కూతురు హరిణ్య రెడ్డి నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్‌లో పెద్దల ఆశీర్వాదాలతో ఘనంగా జరిగింది” అంటూ ఫోటోలు షేర్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories