Singam 4: సింగం సిరీస్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

singam movie franchise to continue
x

సింగం సిరీస్ కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్

Highlights

* సూర్య హీరోగా సింగం 4 సిద్ధం చేస్తున్న హరి

Singam 4: తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ హీరోలలో సూర్య పేరు ముందే ఉంటుంది. అందులో సూర్య హీరోగా నటించిన సింగం సిరీస్ తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను అందుకొని అంచనాలకు మించి బాక్సాఫీస్ హిట్టుగా నిలిచింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. "సింగం 4" కి సంబంధించి ఒక ఐడియా హరి వద్ద ఉందట. ఈ మధ్యనే హరి ఈ పాయింట్ ని సూర్యకి కూడా వినిపించారని, స్క్రిప్ట్ విన్న సూర్య వెంటనే ఓకే చెప్పేసారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య దానిని పూర్తి స్క్రిప్ట్ పనిచేయమని అడిగాడట.

సూర్యతో పాటు హరి కూడా "సింగం 4" సినిమా తీయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక స్క్రిప్ట్ వర్క్ పూర్తవగానే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళుతుంది. 2010లో విడుదలైన సింగం లో అనుష్క హీరోయిన్ గా నటించగా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత 2013లో ఈ సినిమాకి సీక్వల్ గా సింగం 2 కూడా అనుష్క హీరోయిన్గా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. 2017 లో సింగం 3 కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించింది. ఈ సినిమా కలెక్షన్లు ఆశాజనకంగానే ఉన్నాయి. మరి దీనికి సీక్వెల్ గా వస్తున్న సింగం 4 ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories