Mahasamudram: ప్రిన్స్ మళ్లీ వచ్చాడు.. సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్

Maha Samudranm Siddharth
x

సిద్ధార్థ్ 

Highlights

Mahasamudram: శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మహాసముద్రం'.

Mahasamudram: శర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'మహాసముద్రం'. లవ్ ఆండ్ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. శనివారం హీరో సిద్ధార్థ్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి ట్విటర్లో షేర్ చేశారు. ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ''మీ అందరి హృదయాలను గెలుచుకోవడానికి ప్రిన్స్ మళ్లీ వచ్చారు'' అంటూ పేర్కొన్నారు. అదితిరావు హైదరి, ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Rx100 తోనే దర్శకత్వ ప్రతిభ చాటుకున్న అజయ్‌ భూపతి 'మహాసముద్రం' అనే మరో వైవిద్యభరితంగా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ లుక్ లో సిద్ధార్థ్ క్యూలైన్లో నిలబడి ఎవరికోసమే తొంగి చూస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన 'మహాసముద్రం' పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఇటీవలే అదితిరావు హైదరి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'మహా' అనే పాత్రలో అదితిరావు హైదరి కనిపించనుందని పేర్కొంటూ ఈ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

'లైట్ హౌస్ ఆఫ్ మహాసముద్రం' అంటూ మరో హీరోయిన్ అను ఇమ్మానుయేల్ లుక్ ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 6న శర్వానంద్ లుక్ విడుదల చేశారు. తాజాగా సిద్దు లుక్ కూడా రివీల్ కావడంతో సినిమాపై అంచనలు పెంచాయి. ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా 'మహాసముద్రం' రిలీజ్ కానుంది. వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్‌, సిద్ధార్థ్, అదితిరావు హైదరి, ఇమ్మానుయేల్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories