
Shruti Haasan: రీల్ లైఫ్ హీరో కాదు.. రియల్ లైఫ్ ‘దేవత’.. చిన్నారి ప్రాణం నిలబెట్టిన శ్రుతి హాసన్
Shruti Haasan: వెండితెరపై గ్లామర్ తారగా, సింగర్‌గా మనందరికీ సుపరిచితురాలైన శ్రుతి హాసన్, ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆడంబరాలకు వెళ్లకుండా, ప్రచారానికి దూరంగా ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నారు.
Shruti Haasan: వెండితెరపై గ్లామర్ తారగా, సింగర్‌గా మనందరికీ సుపరిచితురాలైన శ్రుతి హాసన్, ఇప్పుడు కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆడంబరాలకు వెళ్లకుండా, ప్రచారానికి దూరంగా ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నారు.
ఆళవి అనే చిన్నారి MSMD అనే అత్యంత అరుదైన వ్యాధితో పోరాడుతోంది. శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించే ఈ వ్యాధికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి) ఒక్కటే మార్గం. చికిత్సకు అయ్యే భారీ ఖర్చు భరించలేక, బిడ్డను కాపాడుకోవడానికి ఆ తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికగా సాయం కోరారు.
ఆ దీనగాథ శ్రుతి హాసన్ వరకు చేరగానే ఆమె ఏమాత్రం ఆలస్యం చేయలేదు.చికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని అందించి అండగా నిలిచారు.ఉత్తమ వైద్యులను సంప్రదించేలా చేసి, చికిత్సలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పర్యవేక్షించారు.చిన్నారి ఐసీయూలో ఉన్న సమయంలో నిరంతరం ఆ కుటుంబంతో టచ్‌లో ఉంటూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు.
చికిత్స విజయవంతం అయ్యాక, శ్రుతి హాసన్ ఆ చిన్నారిని వ్యక్తిగతంగా కలిసి కాసేపు ఆడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆళవి తల్లిదండ్రులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.శ్రుతి హాసన్ మా బిడ్డ ప్రాణాలను కాపాడిన దేవత. ఆమె చేసిన సహాయం వెలకట్టలేనిది. మా కుటుంబం ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటుంది అని వారు పేర్కొన్నారు.
సాధారణంగా సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న సాయాలకే సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతుంటుంది. కానీ, శ్రుతి హాసన్ ఇంత పెద్ద బాధ్యతను తీసుకుని, ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టినా ఎక్కడా గొప్పలు చెప్పుకోలేదు. ఆ తల్లిదండ్రులు స్వయంగా పోస్ట్ చేసే వరకు ఈ విషయం బయట ప్రపంచానికి తెలియకపోవడం ఆమె సంస్కారానికి నిదర్శనం. మెరిసే కళ్లలో కనిపించేది అందం మాత్రమే కాదు.. ఆ కళ్ల వెనుక ఉన్నది అంతకు మించిన మంచి మనసు అని శ్రుతి హాసన్ నిరూపించారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




