శృతిహాసన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందా?

Shruti Haasan Marriage Soon
x

శృతిహాసన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందా?

Highlights

* పెళ్లికి రెడీ అవుతున్న స్టార్ హీరోయిన్

Shruti Haasan: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పెళ్ళికాని హీరోయిన్లలో శృతిహాసన్ కూడా ఒకరు. అయితే శృతిహాసన్ వ్యక్తిగత జీవితం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. శృతిహాసన్ ఏ ఇంటర్వ్యూ కి వెళ్లిన ఆమెను తరచుగా అడిగే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని. అయితే ఆమె మాత్రం ఎప్పుడూ ఆ ప్రశ్నకు ఇప్పట్లో కాదు ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన కరియర్ మీదనే అని చెప్పి కొట్టి పారేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు మరొకసారి శృతిహాసన్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది.

గత కొంతకాలంగా శృతిహాసన్ మరియు డూడుల్ ఆర్టిస్ట్ శాంతా హజారికా ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు శృతిహాసన్ అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ ఏడాదిలోనే శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శృతిహాసన్ మాత్రం ఇంకా ఈ పుకార్లపై రియాక్ట్ అవ్వాల్సి ఉంది.

మరోవైపు కరియర్ పరంగా కూడా శృతిహాసన్ చాలా బిజీగా ఉంటుంది. ఈ మధ్యనే సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు సీనియర్ హీరోల సినిమాలు వాల్తేరు వీరయ్య మరియు "వీర సింహా రెడ్డి" సినిమాలలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఇప్పుడు శృతిహాసన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న "సలార్" సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
Show Full Article
Print Article
Next Story
More Stories