logo
సినిమా

ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్

Shruti Haasan is Busy With Three Star Hero Films | Movie News
X

ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్

Highlights

* ముగ్గురు స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న శృతిహాసన్

Shruti Haasan: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లలో కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ కూడా ఒకరు. అయితే తన తోటి సీనియర్ హీరోయిన్లైన తమన్నా, సమంత, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లతో పోలిస్తే ఈమెకు ఆఫర్లు ఈ మధ్యకాలంలో బాగా తగ్గిపోయాయి అని చెప్పుకోవచ్చు. కానీ తాజా సమాచారం ప్రకారం శృతిహాసన్ చేతిలో ఇప్పుడు మూడు బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన "క్రాక్" తో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చిన శృతిహాసన్ తాజాగా ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన "సలార్" సినిమాతో బిజీగా ఉంది.

ఇక తాజాగా ఇప్పుడు శృతిహాసన్ మరో రెండు సినిమా షూటింగులలో కూడా పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరో గా కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న "వాల్తేరు వీరయ్య" సినిమా కాగా మరొకటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన నటిస్తున్న #ఎన్బికె107.

ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో ఈ రెండు సినిమాల షూటింగు తోను శృతిహాసన్ ఫుల్ బిజీగా ఉంది. ఒకవైపు ఈ రెండు సినిమా షూటింగులు మాత్రమే కాక మరోవైపు ప్రభాస్ సినిమా కూడా ఉండడంతో అన్ని షూటింగులు కవర్ చేయలేక శృతిహాసన్ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మళ్ళీ శృతి చేతిలో మూడు బడా ప్రాజెక్టులతో ఉండడంతో శృతిహాసన్ డిమాండ్ పెరిగినట్లు చెప్పుకోవచ్చు.

Web TitleShruti Haasan is Busy With Three Star Hero Films | Movie News
Next Story