డ్రగ్స్ కేసులో అరెస్టయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు

Shraddha Kapoor Brother Arrested in Drugs Case | Bollywood News
x

డ్రగ్స్ కేసులో అరెస్టయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు

Highlights

*డ్రగ్స్ కేసులో అరెస్టయిన స్టార్ హీరోయిన్ తమ్ముడు

Shraddha Kapoor: ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ సోదరుడు మరియు ప్రముఖ నటుడు శక్తి కుమార్ తనయుడు అయిన సిద్ధాంత్ కపూర్ పార్క్ హోటల్ లో జరిగిన డ్రగ్ రెయిడ్ లో దొరికిపోయారు. బెంగుళూరు లో ఉండే పార్క్ హోటల్ లో జరిగిన ఒక పార్టీ గురించిన ఇన్ఫర్మేషన్ దొరకగా బెంగళూరు పోలీసులు ఆ హోటల్ని రెయిడ్ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ సమయంలో డ్రగ్స్ తీసుకున్నందుకుగాను సిద్ధాంత కపూర్ ను కూడా అరెస్ట్ చేశారు.

సిద్ధాంత్ కపూర్ తో పాటు మరో ఐదుగురు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా రుజువు అయినట్లు తెలుస్తోంది. వీరందరి పై నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకొట్రోపిక్ సబ్స్టన్స్ యాక్ట్ పరంగా కేసులు నమోదయ్యాయి. నిజానికి సిద్ధాంత్ కపూర్ ఈ పార్టీకి ఒక డిజే గా హాజరయ్యారు. కానీ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన సిద్ధాంత్ కపూర్ ఇప్పుడు జైలుపాలయ్యారు.

2020లో బాలీవుడ్ రాకెట్ తో గురించి బయటకు వచ్చినప్పుడు పోలీసులు శ్రద్ధా కపూర్ ని కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇక తాజాగా సిద్ధాంత్ కపూర్ అరెస్ట్ పై రియాక్ట్ అవుతూ వీటన్నిటి గురించి తనకి తెలియదని ఇప్పుడు వార్తల్లో చూసి తెలుసుకున్నానని చెప్పారు శక్తి కపూర్. "షూటౌట్ ఎట్ వడాల", "హసీనా పార్కర్", "జజ్బా" వంటి హిందీ సినిమాల్లో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు సిద్ధాంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories