ధనుష్ ని చూసి విజయ్ నేర్చుకోవాలా?

Should Vijay learn from Dhanush?
x

ధనుష్ ని చూసి విజయ్ నేర్చుకోవాలా?

Highlights

*ఆ విషయంలో విజయ్ ధనుష్ ని ఫాలో అవ్వాలి అంటున్న ఫ్యాన్స్..

Vijay: విజయ్ హీరోగా నటించిన "కత్తి" మరియు "తుపాకీ" సినిమాలతో విజయ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఏ ఆర్ మురగదాస్ ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. నిన్న మొన్నటిదాకా తమిళ్లో స్టార్ గా ఉన్న విజయ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకుంటున్నారు. టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చినప్పటికీ విజయ్ మాత్రం తెలుగు రాష్ట్రాలకి రావటానికి ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు.

ఈమధ్యనే విడుదల అయిన తన "వారసుడు" సినిమా ప్రమోషన్ల కోసం కూడా విజయ్ తెలుగు రాష్ట్రాల వైపు చూడకపోవడం అభిమానులను నిరాశ పరుస్తోంది."వారసుడు" సినిమాని నిర్మించింది తెలుగు నిర్మాత దిల్ రాజు మరియు దర్శకుడు కూడా వంశీ పైడిపల్లి కూడా తెలుగువాడే. ఈ నేపథ్యంలో సినిమాని టాలీవుడ్ లో బాగా ప్రమోట్ చేయాల్సిన బాధ్యత కూడా విజయ్ మీద ఉంది. కానీ విజయ్ మాత్రం ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ప్రమోట్ చేయలేదు.

దీని కారణంగానే సినిమా యావరేజ్ రెస్పాన్స్ ను అందుకుంది. కానీ మరోవైపు ధనుష్ కి ఆల్రెడీ తెలుగులో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన "సార్" సినిమా కోసం ధనుష్ హైదరాబాద్ కి వచ్చి మరి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కూడా ధనుష్ లాగా తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని అభిమానులు కూడా చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories