Tollywood: నేటి నుంచి సినీ కార్మికుల సమ్మె

Shooting Stops in Tollywood
x

Tollywood: నేటి నుంచి సినీ కార్మికుల సమ్మె

Highlights

Tollywood: టాలీవుడ్‌లో నిలిచిపోయిన షూటింగ్స్‌

Tollywood: టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లు నిలిచిపోనున్నాయి. సినీ కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల‌కు వేత‌నాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ సమ్మెకు పిలిపునిచ్చింది. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన సిబ్బంది స‌మ్మె బాట పట్టారు. నిర్మాత‌ల మండ‌లి.. ఫిలిం ఫెడరేషన్‌తో జరిపిన చర్చలు ఫ‌లించ‌లేదు. చర్చ‌లు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఇవాళ్టి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌ల‌ను బంద్ చేస్తున్న‌ట్లు తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది. కార్మికుల వేత‌నాల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకునేదాకా స‌మ్మె విర‌మించేది లేద‌ని ఫెడ‌రేష‌న్ తేల్చి చెప్పింది. వేత‌న స‌వ‌ర‌ణ జ‌రిగేదాకా కొన‌సాగ‌నున్న స‌మ్మెలో 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులు పాల్గొన్నారు.

కృష్ణనగర్‌లో తమ యూనియన్ ఆఫీస్‌లకు సినీ కార్మికులు చేరుకుంటున్నారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులు, ఇతర వాహనాలను ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. కాసేపట్లో తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం దగ్గర 24 క్రాఫ్ట్స్ కార్మికులు ఆందోళనకు దిగనున్నారు. మరోవైపు ఇవాళ కూడా ఫిలిం ఛాంబర్‌లో నిర్మాతల మండలితో ఫిలిం చాంబర్ సభ్యులు చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories