ఓటిటి ల దోపిడీ.. పే పర్ వ్యూ సిస్టమ్ తో షాక్...

Shock to OTT Audience with Pay Per View System for KGF Chapter 2 Movie | Live News Today
x

ఓటిటి ల దోపిడీ.. పే పర్ వ్యూ సిస్టమ్ తో షాక్...

Highlights

OTT Pay Per View: ఓటిటి లు వచ్చిన తరువాత ధియేటర్ లో ఆక్సుపెన్సీ తగ్గిపోయింది‌...

OTT Pay Per View: ఓటిటి లు వచ్చిన తరువాత ధియేటర్ లో ఆక్సుపెన్సీ తగ్గిపోయింది‌. ఇంట్లోనే వ్యూవర్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను, ఓవర్ ద టాప్ సంస్దలు అందిస్తున్నా యన్న ఆనందం లో ఎవరు కూడా మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ సమయం చూసి ఓటిటి లు దోపిడి ని ప్రారంభించాయి. నిన్నటి వరకు కేవలం సబ్ స్క్రైబ్ చేస్తె చాలన్న వారు, నేడు ఎర్లీ యాక్సిస్ పేరుతో నయా దందా కు తెరలేపారు.

సోమవారం అమెజాన్ ప్రైమ్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 ఎలాంటి ప్రచార హడావడి లేకుండా సైలెంట్ గా వచ్చేసింది. నిజానికి ఓటిటి స్క్రీనింగ్ అంటే వారం ముందు నుంచే ప్రోమోలు, సోషల్ మీడియా పోస్టులు హడావిడి గట్టిగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఈ తరహా ప్రమోషన్స్ జరిగాయి కూడా. కేజిఎఫ్ 2 కి మాత్రం ప్రైమ్ వీడియో గుట్టుచప్పుడు కాకుండా స్ట్రీమింగ్ మొదలుపెట్టింది.‌ అయితే సినిమాను చూద్దామనుకున్న వారికి షాక్ తగిలింది. ప్రైమ్ అకౌంట్ ఉన్నంత మాత్రాన చూసేందుకు వీలు కాదు.

ఎర్లీ యాక్సిస్ పేరుతో 199 రూపాయలు చెల్లిస్తేనే ప్రీమియర్ చూసె వీలుంటుందని తెలుసుకుని ఒక్కసారిగా ప్రేక్షకులు వెనక్కి తగ్గారు. అదీ కూడా రెండు రోజుల వాలిడిటీ మాత్రమే.. ఏవైనా కారణాల వల్ల స్కీనింగ్ కుదరకపోతే మళ్ళీ ఇంకోసారి డబ్బులు కట్టాల్సిందే. అంటే ఒకరకంగా థియేటర్ కు మనం టికెట్ కొని చూసినట్టు, ఇక్కడ పే పర్ వ్యూతో సొమ్ములు వదిలించుకోవాలన్నా మాట. అంతా ఉచితం అనుకున్న వ్యూవర్స్ కు ఈ దందా పెద్ద షాక్ ఇచ్చినట్టయింది.

మరోపక్క రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా ఇదే తరహాలో ఈ నెల 20న జీ5 ఓటిటి లో స్క్రీనింగ్ కు రానుంది. అది‌ కూడా ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ పద్దతిలోనే.. అందుకే ఆర్ఆర్ఆర్ కంటే ముందుగా, కేజిఎఫ్ 2 ను ఎర్లీ యాక్సిస్ పేరుతో స్క్రీనింగ్ చేయడం, ప్రైమ్ వీడియో బిజినెస్ స్ట్రాటజీలో భాగంగా కనిపిస్తోంది. ఎందుకంటే వ్యూవర్స్ రెండింటికి డబ్బులు ఖర్చు పెట్టలేరు. ఏదో ఒకదానికి రెండు వందలు అంటే ముందడుగు వేస్తారు‌. అలాంటప్పుడు ఆ అడ్వాంటేజ్ ని తామే ఎందుకు తీసుకోకూడదనేది ప్రైమ్ సైలెంట్ గా ప్లాన్ చేసిందంటున్నారు.

సాధారణంగా రాత్రి 10 లేదా 12 గంటలకు స్ట్రీమింగ్ చేసే ప్రైమ్ కేజిఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ ని, మధ్యాహ్నం సమయంలో, అది కూడా వీక్ డే అయిన సోమవారం రిలీజ్ చేయడం అన్నిటి కన్నా ఆశ్చర్యం కలిగించే విషయం. కేజిఎఫ్ 2 ధియేటర్స్ లో ఇంకా చెప్పుకొదగ్గ వసూళ్లనే అందుకుంటొంది. 1200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన కెజిఎఫ్ 2 నార్త్ లో ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధాన సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా సడన్ గా ఓటిటిలో విడుదల చేస్తారని ఎవరు ఊహించలేదు.

ఇక సాధారణ ప్రేక్షకులకు థియేటర్ లో టికెట్ల రేటు ఎక్కువ ఉండటం వల్ల, ఆల్టర్నేటివ్ ప్లాట్ ఫామ్స్ గా ఓటిటి లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు అవి కూడా పే పర్ వ్యూ పేరుతో వసూలు చేస్తుండటం ఇబ్బందికర పరిణామం.‌ భవిష్యత్తులో దాదాపు అన్నీ ఓటిటిలు ఇదే తరహా దందాకు తెరలేపుతారు.‌ ఇక‌ సబ్ స్క్రైబ్ చేసుకుని ఉచితంగా సినిమాలు చూడాలనుకునే వారు క్రమంగా దూరమయ్యే అవకాశం ఉంది. అలా అని వారిలో ధియేటర్స్ లో సినిమాను వీక్షిస్తారా అన్నది అనుమానమే. ఈ క్రమంలో మరలా‌ పైరసీ వైపు మళ్లే అవకాశముంది. ఓటిటి లో భారీ రేట్ ని పెట్టి టీవీలో చూడమంటే కరెక్ట్ కాదేమోననే అభిప్రాయాలు ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఏదైనా వ్యూవర్ షిప్ ను బట్టి మారతాయి కాబట్టి, కేజిఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ ల స్ట్రీమింగ్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టే పే పర్ వ్యూ ల దోపిడి ఉంటుందా, ఊడుతుందా అనేది తెలుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories