Shivaratri Special: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

Maha Shivaratri is a Special Day for Pawan Kalyan Fans
x

పవన్ కళ్యాణ్ 27వ సినిమా

Highlights

Shivaratri Special: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Shiva Ratri Special: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రస్తుతం పలు సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి క్రిష్ జాగర్లముడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో వస్తున్న మూవీ. ప్రస్తుతానికైతే పవన్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. కానీ మహా శివరాత్రి (Maha Shiva Ratri) సందర్భంగా మార్చి 11 న పవన్ కళ్యాణ్ 27వ (#PSPK27) సినిమా టైటిట్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ శివరాత్రి రోజున విడుదల చేస్తున్నట్లు ఫిల్మ్ యూనిట్ అధికారికంగా ధృవీకరించింది. చాలాకాలంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఏ ఒక్క ఫొటో కూడా ఇంటర్నెట్ లో విడుదల చేయలేదు. అందుకే ఫ్యాన్ ను ఖుషీ చేసేందుకు శివరాత్రి రోజును ఎంచుకున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez), నిధి అగర్వాల్ (Niddhi Agarwal) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Show Full Article
Print Article
Next Story
More Stories