పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా కి డబ్బింగ్ చెబుతున్న శివ రాజ్ కుమార్

Shivarajkumar on Dubbing for his Brother Puneeth Rajkumars Last Film James
x

పునీత్ రాజ్ కుమార్ ఆఖరి సినిమా కి డబ్బింగ్ చెబుతున్న శివ రాజ్ కుమార్

Highlights

డబ్బింగ్ చెబుతూ ఎమోషనల్ అవుతున్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడు

Shiva Rajkumar: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక అభిమానులకి కూడా ఇప్పటికీ ఒక చేదు నిజం గా మిగిలిపోయింది. పునీత్ రాజ్ కుమార్ ఇకలేరు అనే విషయాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నడ ఇండస్ట్రీ కి ఇది ఒక పెద్ద తీరని లోటు. కేవలం తన నటన మరియు సినిమాలతో మాత్రమే కాక తన మంచి హృదయంతో ఎందరికో అండగా నిలిచిన పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త ఇప్పటికీ ఒక చాలామందికి షాకింగ్ గానే ఉంది. అయితే బతికున్నప్పుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి సినిమా "జేమ్స్".

సినిమా డబ్బింగ్ పనులు పూర్తవక ముందే పునీత్ రాజ్ కుమార్ కాలం చేశారు. అయితే తాజాగా పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివ రాజ్ కుమార్ ఈ సినిమాలో పునీత్ రాజ్ కుమార్ పాత్ర కి డబ్బింగ్ చెప్పబోతున్నారు. "సినిమాలో కొన్ని సన్నివేశాలు డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నాను. కానీ ఆ సమయంలో పునీత్ ని తెరపై చూడటం ఎమోషనల్గా కలచి వేస్తోంది. అయినా సరే నేను డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అభిమానులకి నచ్చుతుందో లేదో" అని చెప్పుకొచ్చారు శివ రాజ్ కుమార్. అంతేకాకుండా పునీత్ రాజ్ కుమార్ మరణానికి నివాళిగా కన్నడ డిస్ట్రిబ్యూటర్లు మార్చ్ 17 నుంచి మార్చి 23 దాకా ఎటువంటి సినిమాని విడుదల చేయకుండా కేవలం "జేమ్స్" సినిమా మాత్రమే అన్ని థియేటర్లలో ఆడించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories