logo
సినిమా

ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ రాజా

ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసిన శివాజీ రాజా
X
Highlights

ఈమధ్యనే మా అసోసియేషన్ లో జరిగిన ఎన్నికలు సర్వత్రా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత...

ఈమధ్యనే మా అసోసియేషన్ లో జరిగిన ఎన్నికలు సర్వత్రా సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత తామంతా ఒకటేనని ఎన్ని కబుర్లు చెప్పినా పరిస్థితులు చూస్తుంటే అలా లేదు. ఎన్నికల్లో పరాజయం పాలైన శివాజీరాజా తన పదవిని వదిలిపెట్టటం లేదని, తన పదవీ కాలం పూర్తి అయ్యే కదిలేది లేదు అంటున్నారని నరేశ్ వర్గం ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం సంచలనంగా మారింది. తాను పదవిలో ఉండగానే నరేష్ ప్రమాణస్వీకారం చేస్తే, తాను కోర్టుకు వెళతానంటూ శివాజీరాజా చెబుతున్నారని నరేశ్ వాదన. తాజాగా ఈ రోజు శివాజీ రాజా హటాత్తుగా తెర మీదకు వచ్చారు.

ప్రెస్ తో మాట్లాడుతూ, తాను కోర్టుకు వెళతానని అసలు అనలేదని, తాను గెలిచినప్పుడు కూడా పదవీ కాలం పూర్తి అయ్యాకే తాను ప్రమాణస్వీకారాన్ని చేశానని గుర్తు చేశారు. తన పరువు తీసే విధంగా నరేశ్ ప్యానెల్ మత్కడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నాగబాబు మంచి మిత్రుడని, ఎన్నో ఏళ్లుగా తమ మధ్య స్నేహం ఉందని కానీ అలాంటి నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ నరేశ్ వర్గానికి మద్దతు పలికి తనకి గిఫ్ట్ ఇచ్చారు అని, త్వరలోనే ఆయనకు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. తనపై వారు చేసిన విమర్శలకు, ఆరోపణలకు సమాధానం ఇస్తూ శివాజీ రాజా సంచలనాత్మకంగా మాట్లాడారు.

Next Story