Shilpa Shetty: శిల్పా శెట్టి ఇంస్టాగ్రామ్ స్టోరీ తన భర్త కోసమేనా?

Shilpa Shetty Shares First Instagram Story as Husband Raj Kundra Walks out of Jail After Bail in Porn Case
x

శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా (ఫోటో - ది హన్స్ ఇండియా) 

Highlights

* ఎంత పెద్ద గాలివాన తర్వాత అయినా అందమైన విషయాలు జరుగుతాయని ఇంద్రధనస్సు నిరూపిస్తుంది అంటూ శిల్పాశెట్టి కామెంట్స్

Shilpa Shetty - Raj Kundra: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఈ మధ్యనే పోర్న్ రాకెట్ కేసులో ఇరుక్కుని జైలు కి వెళ్ళిన సంగతి తెలిసిందే. 2 నెలల క్రితం ఎనిమిది వారాల పాటు జైలు గోడల మధ్య కూర్చున్న రాజ్ కుంద్రాకి ఈ మధ్యనే సోమవారం నాడు బెయిల్ వచ్చింది. రాజ్ కుంద్రా జైలు నుండి విడుదలైన కొన్ని గంటలకే శిల్పాశెట్టి ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ ని షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. చైనీస్ అమెరికన్ ఆర్కిటెక్ట్ రోజర్ లి చెప్పిన "ఎంత పెద్ద గాలివాన తర్వాత అయినా అందమైన విషయాలు జరుగుతాయని ఇంద్రధనస్సు నిరూపిస్తుంది," శిల్పా శెట్టి షేర్ చేయడం విశేషం.

50 వేల షూరిటీ మరియు కొన్ని కండిషన్ ల మీద ముంబై కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. గతవారం ముంబై పోలీస్ ఈ విషయానికి సంబంధించి 14 వందల పేజీల ఛార్జీషీటును కోర్టులో సబ్మిట్ చేయడం గమనార్హం. ఈ చార్జిషీట్లో రాజ్ కుంద్రా పై ఉన్న అన్ని ఆరోపణలను మెన్షన్ చేశారు. కానీ అందులో తగిన నా ఆధారాలు మాత్రం లేకపోవడంతో రాజ్ కుంద్రా కేవలం ఒక బలి పశువు అయ్యారు అని కొందరు అంటున్నారు. మరోవైపు రాజ్ కుంద్రా బిజినెస్ యాక్టివిటీస్ గురించి తనకేమీ తెలియదని ఇప్పటికే శిల్పాశెట్టి చేతులు దులుపేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories