Shihan Hussaini: జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుసైని కన్నుమూత

Shihan Hussaini: జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్ గురువు షిహాన్ హుసైని కన్నుమూత
x
Highlights

Shihan Hussaini: ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని మరణించారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని...

Shihan Hussaini: ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుసైని మరణించారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. హుసైని మరణంపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్ కు హుసైని మార్షల్ ఆర్ట్స్ , కరాటే, కిక్ బాక్సింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు.

షిహాన్ హుసైని 1986లో విడుదలైన పున్నగై మన్నన్ సినిమా ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయం అయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన బద్రి మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికిపైగా విద్యార్థులను తయారు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories