శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ 'మహా సముద్రం' రిలీజ్ డేట్‌

శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ మహా సముద్రం రిలీజ్ డేట్‌
x
Highlights

గత కొంత కాలంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. కాగా.. ఏడాది మళ్లీ మల్టీ స్టారర్ చిత్రాలకు ఊపందుకున్నాయి. తాజాగా శర్వానంద్,...

గత కొంత కాలంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. కాగా.. ఏడాది మళ్లీ మల్టీ స్టారర్ చిత్రాలకు ఊపందుకున్నాయి. తాజాగా శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ 'మహా సముద్రం' రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. 'ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.' అంటూ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది.

లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి RX 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగష్టు 19న గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ చిత్రంలో.. దాదాపు 7ఏళ్ల తర్వాత హీరో సిద్ధార్థ్. టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ బాణీలు కట్టాడు. కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం శ్రీకారం. ఈ సినిమా ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చి 11 ప్రేక్షకుల ముందకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories