రెండు సినిమాల పైనే ఆశలన్నీ పెట్టుకున్న శర్వానంద్

Sharwanand has high hopes for both the films
x

రెండు సినిమాల పైనే ఆశలన్నీ పెట్టుకున్న శర్వానంద్

Highlights

Sharwanand: గత కొంతకాలంగా యువ హీరో శర్వానంద్ కు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. 2017లో "మహానుభావుడు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తరువాత "పడి పడి లేచే మనసు" మరియు "రణరంగం" సినిమాలతో మెప్పించలేకపోయడు.

Sharwanand: గత కొంతకాలంగా యువ హీరో శర్వానంద్ కు ఒక్క హిట్ సినిమా కూడా లేదు. 2017లో "మహానుభావుడు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తరువాత "పడి పడి లేచే మనసు" మరియు "రణరంగం" సినిమాలతో మెప్పించలేకపోయడు. 2020 లో విడుదలైన "జాను" సినిమా పరవాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత 2021లో విడుదలైన "శ్రీకారం" మరియు "మహాసముద్రం" సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. దీంతో శర్వా మార్కెట్ బాగా పడిపోయింది అని చెప్పుకోవచ్చు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన "మహా సముద్రం" సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

ఈ నేపథ్యంలో శర్వానంద్ ఈసారి తన తదుపరి సినిమాతో మంచి హిట్ అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శర్వా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి "ఒకే ఒక జీవితం" కాగా రెండోది కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న "ఆడవాళ్లు మీకు జోహార్లు". రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కాబోతుంది. మరోవైపు ఒకేఒక్క జీవితం కూడా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలతో శర్వానంద్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తాడో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories