Maha Samudram Review: "మహా సముద్రం" మూవీ రివ్యూ

Sharwanand and Siddharth Maha Samudram Movie Review
x

మహా సముద్రం మూవీ రివ్యూ

Highlights

* మహా సముద్రం మూవీ రివ్యూ

Maha Samudram Review: గత కొంతకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సిద్ధార్థ్ ఈ మధ్యనే "శ్రీకారం" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ తో చేతులు కలిపి "మహాసముద్రం" అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. "ఆర్ ఎక్స్ 100" ఫేమ్ అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అను ఎమాన్యూల్ మరియు అదితి రావు హైదరి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్ల తోనే సినిమాపై అంచనాలను పెంచిన చిత్రబృందం తాజాగా ఇవాళ అనగా అక్టోబర్ 14 2021 న దసరా సందర్భంగా సినిమా థియేటర్లలో విడుదల చేశారు. మరి ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న శర్వానంద్ మరియు సిద్ధార్థ్ సినిమాతో ఎంతవరకు మెప్పించారో చూసేద్దామా..

చిత్రం: మహా సముద్రం

నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అను ఏమాన్యూల్, అదితి రావు హైదరి, జగపతి బాబు, రావు రమేష్, తదితరులు

సంగీతం: చైతన్ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

నిర్మాత: రామబ్రహ్మం సుంకర

దర్శకత్వం: అజయ్ భూపతి

బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్

విడుదల తేది: 14/10/2021

కథ :

అర్జున్ (శర్వానంద్) మరియు విజయ్ (సిద్ధార్థ్) చాలా మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వారిని విడదీయడం ఎవరితరం అయ్యేది కాదు. అర్జున్ స్మిత (అను ఇమాన్యుల్) తో ప్రేమలో పడతాడు. మరోవైపు విజయ్ కూడా మహా (అదితి రావు హైదరి) తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాడు. విజయ్ తనలోని అవినీతి క్యారెక్టర్ ని బయటికి తీసుకు రావడంతో కథ మొదలవుతుంది. మాఫియా లీడర్లు విజయ్ ని అంతం చేయాలనుకుంటారు. అదేసమయంలో చుంచు మామ (జగపతిబాబు) అర్జున్ కి సపోర్ట్ చేస్తాడు. చివరికి కి ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటులు:

శర్వానంద్ ఒక యంగ్ స్టార్ పాత్రలో చాలా బాగా నటించాడు. శర్వానంద్ మరియు సిద్ధార్థ్ ల కెమిస్ట్రీ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవచ్చు. శర్వానంద్ మరియు సిద్ధార్థ ఇద్దరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి చాలా బాగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన చాలా బాగుంది. సిద్ధార్థ్ పాత్ర కి చాలా షేడ్స్ ఉంటాయి. అయినప్పటికీ సిద్ధార్థ్ తన పాత్రని చాలా బాగా చేశారు. అదితి రావు హైదరి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. తన క్యారెక్టర్ గ్రాఫ్ ను చాలా బాగా చూపించారు. గ్లామర్ మరియు నటన పరంగా కూడా అదితి మంచి మార్కులు వేయించుకుంది. అదితి రావు హైదరి తో పోలిస్తే మాన్యువల్ పాత్ర చిన్నది గా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేసింది అను ఇమాన్యూల్. జగపతి బాబు మరియు రావు రమేష్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాగా కథను తయారు చేసిన అజయ్ భూపతి మాఫియా బ్యాక్ డ్రాప్ తో కథని నడిపారు. అయినప్పటికీ సినిమా మొదలైనప్పటి నుంచి ఎమోషన్ ల పైన దృష్టి పెట్టారు దర్శకుడు. శర్వానంద్ మరియు సిద్ధార్థ ల స్నేహం గురించి చాలా బాగా చూపించారు. అలాగే వారి ప్రేమకథలు కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయిన అజయ్ భూపతి నెరేషన్ విషయంలో మాత్రం బాగా స్లో అవడం తో కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం సినిమాకి చాలా బాగా సెట్ అయింది. ఒకటి రెండు పాటలు బాగానే ఉన్నాయి. కానీ పాటలతో పోలిస్తే నేపథ్య సంగీతం బాగుంది అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి అతి పెద్ద హైలైట్ గా చెప్పుకోవచ్చు. ప్రతి సన్నివేశాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు సినిమాటోగ్రాఫర్. ఎడిటింగ్ ఇంకొంచెం బాగుండచ్చు అనిపిస్తుంది.

బలాలు:

శర్వానంద్ సిద్ధార్థ్ సన్నివేశాలు

నటీనటులు

ఛాయాగ్రహణం

ఫస్ట్ హాఫ్

బలహీనతలు:

కథ ప్రెడిక్టబుల్ గా ఉండడం

స్లో నేరేషన్

సెకండ్ హాఫ్

చివరి మాట:

కథ కేవలం కొన్ని కొన్ని చోట్ల మాత్రమే బాగుంది అనిపిస్తుంది. ఫస్టాఫ్ చాలా బాగున్నప్పటికీ సెకండాఫ్ మాత్రం చాలా స్లో గా అనిపిస్తుంది. అన్ని క్యారెక్టర్స్ లోని మార్పులు మరియు కథ చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోతుంది. ఆఖరికి సిద్ధార్థ్ పాత్ర కూడా చాలా రొటీన్ గా మారిపోవడం ప్రేక్షకులను నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్ కొంచెం డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. కథలో ఫ్రెష్ నెస్ లేకపోవడం ఈ సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్. నటీనటులు, విజువల్స్ బాగున్నప్పటికీ సెకండ్ హాఫ్ ఏమాత్రం బాగాలేదు.

బాటమ్ లైన్:

విజువల్స్ తో మాత్రమే ఆకట్టుకున్న "మహాసముద్రం".

Show Full Article
Print Article
Next Story
More Stories