వాళ్ళు నో అంటే విజయ్ యస్ అన్నాడట!

వాళ్ళు నో అంటే విజయ్ యస్ అన్నాడట!
x
Highlights

తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.. పెళ్లి చూపులు సినిమాతో కెరియర్ ని మొదలు పెట్టిన విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్నాడు.

తక్కువ టైంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.. పెళ్లి చూపులు సినిమాతో కెరియర్ ని మొదలు పెట్టిన విజయ్ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక గీతాగోవిందం సినిమా మరింత హిట్టు కావడంతో విజయ్ తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్లు ముందుకు వచ్చారు.

ప్రస్తుతం విజయ్ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌కి జోడిగా రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్యా రాజేష్‌, ఇసా బెల్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు కొడుకు కేయస్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు.

ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే నలుగురు హీరోయిన్స్ తో విజయ్ కి ఉన్న రిలేషన్స్ ఏంటి అన్నవి చెబుతూ నాలుగు పోస్టర్లను రిలీజ్ చేశారు. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. టీజర్ లో ఎక్కువభాగం అర్జున్ రెడ్డి పోలికలు ఉన్నప్పటికీ సినిమా ఆకట్టుకుంటుందని విజయ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాని విజయ్ తో చేయడానికి ముందు క్రాంతి మాధవ్ పలువురు హీరోలను సంప్రదించారట! ఇందులో సాయి ధరమ్‌ తేజ్‌, శర్వానంద్‌ పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్లు ఈ కథను రిజెక్ట్ చేయడంతో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ కథ విజయ్‌ దేవరకొండ దగ్గరకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు లాంటి ఫీల్‌గుల్‌ చిత్రాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్‌ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడన్న ఆసక్తి నెలకొంది. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ వార్తను ఇంగ్లీష్ లో చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories