OTT: థియేటర్లలో వచ్చిన 5ఏళ్ల తర్వాత.. ఓటీటీలోకి షకీల బయోపిక్‌

OTT: థియేటర్లలో వచ్చిన 5ఏళ్ల తర్వాత.. ఓటీటీలోకి షకీల బయోపిక్‌
x

OTT: థియేటర్లలో వచ్చిన 5ఏళ్ల తర్వాత.. ఓటీటీలోకి షకీల బయోపిక్‌

Highlights

Shakeela Biopic movie OTT: షకీల ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బీ గ్రేడ్‌ మూవీస్‌తో పాటు రెగ్యులర్‌ మూవీస్‌ నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది.

Shakeela Biopic movie OTT: షకీల ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బీ గ్రేడ్‌ మూవీస్‌తో పాటు రెగ్యులర్‌ మూవీస్‌ నటించి ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అయితే షకీల అనగానే అలాంటి సినిమాలో గుర్తొస్తాయి. కానీ ఆమె జీవితంలోనూ ఎన్నో కష్టాలు, ఎన్నో మలుపులు ఉన్నాయి. వీటన్నింటినీ చూపిస్తూ షకీల బయోపిక్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. షకీలా పేరుతో తెరకెక్కిన ఈ సినిమా 2020 డిసెంబర్‌ 25వ తేదీన థియేటర్లలోకి వచ్చింది.

ఇంద్రజీత్‌ లంకేశ్‌ తెరెక్కించిన ఈ బయోపిక్ లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల తార రిచా చద్దా నటించింది. అలాగే పంకజ్‌ త్రిపాఠీ, టాలీవుడ్ నటి ఎస్తర్‌ నోరన్హ, రాజీవ్‌ పిళ్లై, శివ రానా, కాజోల్‌ చుగ్, సందీప్‌ మలని తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రాన్ని హిందీ, తమిళ,తెలుగు, కన్నడ భాషల్లో ఓకేసారి విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఎమోషనల్‌ కంటెంట్‌ కంటే బోల్డ్‌ కంటెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు అప్పట్లో ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే థియేటర్లలోకి వచ్చిన సుమారు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో షకీలా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో షకీలా హీరోయిన్‌గా ఎలా ఎదిగింది. ఆమె పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన అవమానాలు, మోసాలను ఈ సినిమాలో చూపించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories