Top
logo

ఐశ్వర్యరాయ్ మేనేజర్ కి గాయాలు.. కాపాడిన షారుఖాన్

ఐశ్వర్యరాయ్ మేనేజర్ కి గాయాలు.. కాపాడిన షారుఖాన్
X
Highlights

బాలీవుడ్ హీరో షారుఖాన్ కేవలం రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని చెప్పేందుకు ఈ సంఘటన ఒక్కటి సరిపోతుంది....

బాలీవుడ్ హీరో షారుఖాన్ కేవలం రీల్ హీరో మాత్రమే కాదు రియల్ హీరో అని చెప్పేందుకు ఈ సంఘటన ఒక్కటి సరిపోతుంది. తాజాగా దీపావళి సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఇంట్లో విందును ఇచ్చారు. దీనికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. షారుక్ కూడా అటెండ్ అయ్యాడు. అయితే ఇదే విందులో ఐశ్వర్యరాయ్ మేనేజర్ అర్చన సదానంద్ లెహెంగాకు అక్కడ ఏర్పాటు చేసిన దీపాలకు తగిలి మంటలు అంటుకున్నాయి. దీనితో ఆమె కేకలు వేసింది. అక్కడ ఉన్నవారు అందరు షాక్ అయ్యారు.

అప్పుడు అక్కడే బిగ్ బీతో ముచ్చటిస్తున్నా షారుక్ వెంటనే వెళ్లి తన జాకెట్ తో లెహెంగాకు అంటుకున్న మంటల్ని అర్పేశాడు. ఇందులో అర్చన సదానంద్ కి గాయాలు అయ్యాయి ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచారు. ఇక ఇందులో షారుక్ కి స్వల్ప గాయాలు అయ్యాయి. దాదాపుగా ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. అయితే షారుక్ చేసిన సాహసానికి ఫాన్స్ , నెటిజన్లు ఫిదా అవుతున్నారు. షారుక్ మీరు నిజమైన హీరో అని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story