SRK to leave Mannat: మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్న షారుఖ్... ఆ ఇంటి అద్దె ఎంతో తెలుసా?

Shah Rukh Khan to leave Mannat for renovation works and rents four floors luxury apartment for Rs 24 lakh monthly rent
x

మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్న షారుఖ్ ఖాన్... ఆ ఇంటి అద్దె ఎంతో తెలుసా?

Highlights

Shah Rukh Khan's house rent: ఇకపై షారుఖ్ ఖాన్ మన్నత్ బంగ్లాలో కనిపించరు. ప్రస్తుతం ఉంటున్న మన్నత్ నుండి మరో ఇంటికి..

Shah Rukh Khan's new flat monthly rent: షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ఉంటున్న తన సొంత ఇల్లు మన్నత్ నుండి మరో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారు. మన్నత్ ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు రెనోవేషన్ చేయిస్తున్నారు. మే నెల నుండి పనులు మొదలవనున్నాయి.

మన్నత్ ప్రస్తుతం 6 అంతస్తుల బంగ్లా. దీనికి అదనంగా మరో రెండు అంతస్తులు నిర్మించుకునేందుకు ఈమధ్యే షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబై మునిసిపాలిటీ అధికారుల నుండి అనుమతి తీసుకున్నారు. ఈ ఇల్లు 616 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. చుట్టూ ఉండే ఖాళీ స్థలం దానికి అదనం.

షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు మన్నత్ వద్ద క్యూ కడుతుంటారు. మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ బర్త్ డే రోజు ఆ రద్దీ ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఆయన బాల్కానీలోకి వచ్చి తన అభిమానులను విష్ చేస్తారు. షారుఖ్ ఆ మాత్రం కనిపించినా చాలన్నట్లు ఆయన్ను అలా చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు వస్తుంటారు.

కానీ ఇకపై షారుఖ్ ఖాన్ మన్నత్ బంగ్లాలో కనిపించరు. ఎందుకంటే ఈ ఇంటి రెనోవేషన్ వర్క్ కనీసం రెండు, మూడేళ్లు పడుతుందని తెలుస్తోంది. రూ. 25 కోట్లతో మన్నత్ బంగ్లాను రెనోవేట్ చేయనున్నారు.

మన్నత్ రెనోవేషన్ చేసే సమయంలో తమ కుటుంబం ఉండేందుకు పాలీ హిల్స్‌లో షారుఖ్ ఖాన్ ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్ లీజుకు తీసుకున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ వషు భగ్నానికి చెందిన 4 అంతస్తుల బంగ్లాలోకి షారుఖ్ ఖాన్ షిఫ్ట్ అవుతున్నారు. ఈ ఇంటికి షారుఖ్ ఖాన్ నెలకు రూ. 24 లక్షలు అద్దె చెల్లించనున్నారు.

Also watch this video- New York Grand Central Station: గిన్నిస్ బుక్ రికార్డులకెక్కిన అద్భుతం!

Show Full Article
Print Article
Next Story
More Stories