రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు.. లావణ్యపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కంప్లయింట్, అసలేంటీ వివాదం?

Series of Complaints Lodged in Raj Tarun  Affair Case
x

రాజ్ తరుణ్‌పై లావణ్య ఫిర్యాదు.. లావణ్యపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కంప్లయింట్, అసలేంటీ వివాదం?

Highlights

రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మాల్వీ మల్హోత్రా తనను, తన పేరేంట్స్ ను లావణ్య బెదిరించిందని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయకడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాల్వీ మల్హోత్రా మోజులో పడి తనను మోసం చేశారని లావణ్య అనే యువతి హైద్రాబాద్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు.

రాజ్ తరుణ్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మాల్వీ మల్హోత్రా తనను, తన పేరేంట్స్ ను లావణ్య బెదిరించిందని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయకడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు లావణ్య తన ఫిర్యాదుకు సంబంధించి పోలీసులకు ఇవ్వబోయే ఆధారాలు కేసులో కీలకం కాబోతున్నాయి.

రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు

రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశారని లావణ్య ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె ఈ ఆరోపణలు చేశారు.

రాజ్ తరుణ్ తాజాగా నటించిన తిరగబడర సామీ చిత్రంలో హీరోయిన్ అయిన మాల్వీ మల్హోత్రాపై కూడా లావణ్య ఆరోపణలు చేశారు. ఆమె కారణంగానే తనను రాజ్ తరుణ్ దూరం పెట్టారన్నది లావణ్య ఫిర్యాదు.


లావణ్యతో సంబంధం నిజమే... కానీ,

లావణ్య ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. 2017 వరకు లావణ్యతో తనకు సంబంధం ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని కూడా రాజ్ తరుణ్ చెప్పారు.

అంతేకాదు, మస్తాన్ సాయితో ఆమె సహజీవనం చేస్తున్నారని, సాయి కావాలంటూ కేసు పెట్టారని, ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆయన మీడియాకు చూపారు.


మరో ఇద్దరు యువతులతో రాజ్ తరుణ్ కు సంబంధం ఉందన్న లావణ్య

హీరో రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలివ్వాలని నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు ఇచ్చారు. అదే సమయంలో లావణ్యపై చేసిన ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ను కూడా ఆధారాలు ఇవ్వాలని పోలీసులు నోటీసులు అందించారు. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులకు అన్ని ఆధారాలు అందిస్తానని లావణ్య మీడియాకు చెప్పారు.

మాల్వీతో పాటు మరో ఇద్దరు యువతులతో కూడా రాజ్ తరుణ్ కు సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. లావణ్య ఆధారాలు సమర్పిస్తే, రాజ్ తరుణ్ కూడా తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందించే అవకాశం ఉంది.


నా పేరేంట్స్ ను లావణ్య బెదిరించారు: మాల్వీ మల్హోత్రా

ముంబైకి చెందిన మోడల్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి రాజ్ తరుణ్ తనను పక్కన పెట్టారని లావణ్య ఆరోపించారు. ఈ ఆరోపణలను మాల్వీ ఖండించారు. రాజ్ తరుణ్ తాను నటించిన సినిమాలో హీరో మాత్రమేనని ఆమె చెప్పారు. అనవసర ఆరోపణలు చేస్తూ తనను, తన పేరేంట్స్ ను కూడా లావణ్య బెదిరిస్తున్నారని మాల్వీ ఆరోపించారు. లావణ్య బెదిరింపులకు సంబంధించిన ఆధారాలతో సైబరాబాద్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలకు సంబంధించి లావణ్య పోలీసులకు ఎలాంటి ఆధారాలు ఇవ్వబోతున్నారు? ఆ ఆధారాలు ఎలాంటివనే దానిపైనే కేసు ఏ మలుపు తిరుగుతుందన్నది ఆధారపడి ఉంది.

రాజ్ తరుణ్ మాత్రం లావణ్య తనను దురుద్దేశంతో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ ఇద్దరూ తమ ఫిర్యాదులకు సంబంధించి ఇచ్చే ఆధారాలు ఎలా ఉండబోతున్నాయి. అవి కేసును ఏ మలుపు తిప్పుతాయన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయంగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories