"ఆ పాట నేను పాడి ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది," అంటున్న సీనియర్ సింగర్

Senior Singer Made Shocking Comments On This Song
x

"ఆ పాట నేను పాడి ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది," అంటున్న సీనియర్ సింగర్

Highlights

* "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాటపై షాకింగ్ కామెంట్లు చేసిన సీనియర్ సింగర్

LR Eswari: ఒకప్పటి ప్రముఖ సింగర్ ఎల్ ఆర్ ఈశ్వరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకి ఆమె గొంతు ఎప్పటికీ గుర్తుంటుంది. టాలీవుడ్ లో "మసక మసక చీకటిలో", "భలే భలే మగాడివోయ్", "తీస్కో కోక కోలా" వంటి బ్లాక్ బస్టర్ పాటలను పాడిన ఎల్ ఆర్ ఈశ్వరి తాజాగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప: ది రైజ్" సినిమాలోని "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఈ పాటలో అల్లు అర్జున్ తో సమంత స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. "పుష్ప" సినిమాలో చార్ట్ బస్టర్ అయిన పాటలలో ఇది కూడా ఒకటి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ పాట గురించి ఎల్ ఆర్ ఈశ్వరి ప్రజెంట్ జనరేషన్ లో వస్తున్న పాటలు తనకు నచ్చటం లేదని, "ఊ అంటావా ఊ ఊ అంటావా" అసలు ఒక పాటలా కూడా తనకి అనిపించలేదని అన్నారు. "అది నిజంగా ఒక పాట ఏనా? ఆ పాట కంపోజిషన్ మరియు గాత్రం రెండు ఒకే పిచ్ లో ఉంటాయి. మొదటి నుంచి ఆఖరి దాకా అలానే ఉంటుంది.

గాయకులు ఎలా పాడమంటే అలాగే పడతారు. కానీ వాళ్లతో బాగా పాడించాల్సిన బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్ కి ఉంటుంది. ఆ పాట కనుక నాకు వచ్చి ఉంటే అది నెక్స్ట్ లెవెల్ లో ఉండేది," అని అన్నారు ఎల్ ఆర్ ఈశ్వరీ. "మేము సీనియర్స్. ఎంతో మంది సీనియర్స్ తో కలిసి పని చేసాము. కానీ ఇప్పటికీ మా పాటలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అప్పట్లో సినిమాలు 100 నుంచి 200 రోజులు ఆడేవి కానీ ఇప్పుడు సినిమాలు పది రోజులు ఆడటమే చాలా గొప్పగా మారిపోయింది," అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories