logo
సినిమా

సినిమా హిట్ అవ్వకపోతే మాకు మిగిలేది అప్పులే అంటున్న రాజశేఖర్

Senior Hero Rajasekhar Says All Our Properties Are Gone | Telugu Movie News
X

సినిమా హిట్ అవ్వకపోతే మాకు మిగిలేది అప్పులే అంటున్న రాజశేఖర్

Highlights

*సినిమా హిట్ అవ్వకపోతే మాకు మిగిలేది అప్పులే అంటున్న రాజశేఖర్

Rajasekhar: సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా ఇప్పుడు శేఖర్ అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జీవిత రాజశేఖర్ స్వయంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఈ దంపతులు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాజశేఖర్ గతంలో తాను చాలా ప్రాపర్టీస్ ని పోగొట్టుకున్నట్లు అప్పుల్లోకి వెళ్లినట్లు తెలిపారు. "శేఖర్ కి ముందు మాకు కొన్ని ప్రాపర్టీస్ ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒకవేళ సినిమా కనుక సరిగా ఆడక పోతే మాకు మిగిలేది కేవలం అప్పులు మాత్రమే.

కానీ ప్రేక్షకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని మేము అనుకుంటున్నాము. ప్రేక్షకులందరికీ సినిమానీ కచ్చితంగా థియేటర్లలోనే చూడమని నేను విన్నవించుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు రాజశేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసఫ్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే కొద్దిరోజుల ముందే రాజశేఖర్ కి కరోనా సోకింది. దాని గురించి మాట్లాడుతూ, "ఆ సమయంలో నేను బతకను అని అనుకున్నాను. జోసెఫ్ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ను ఎవరికైనా అమ్మ ఏమని నా భార్య జీవితాకి చెప్పాను.

కానీ తను మాత్రం నేను కచ్చితంగా కాగా కోరుకుంటానని సినిమా చేయగలను అని అని నాకు నమ్మకం కలిగించింది" అని చెప్పిన రాజశేఖర్ జీవిత ఇంట్లో తనకి భార్య కానీ సెట్స్ లో మాత్రం చాలా ప్రొఫెషనల్ డైరెక్టర్గా ఉండేదని ఒకవేళ సేన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ మళ్ళీ రీటేకులు కోసం అడిగేది అని చెప్పుకొచ్చారు. సినిమాలో ముఖ్య పాత్ర కోసం శివానీ లేదా శివాత్మికా లలో ఎవరినీ తీసుకోవాలి అని ఆలోచిస్తుండగా శివాత్మిక తన అక్క కోసం ఆ పాత్రను త్యాగం చేసింది అని అన్నారు రాజశేఖర్.

Web TitleSenior Hero Rajasekhar Says All Our Properties Are Gone | Telugu Movie News
Next Story