పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు అంటున్న స్టార్ హీరోయిన్

Senior Actor Tabu Sensational Comments on Marriage And Children
x

పిల్లల కోసం పెళ్లి అక్కర్లేదు అంటున్న స్టార్ హీరోయిన్ 

Highlights

*తల్లి కావడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటున్న సీనియర్ హీరోయిన్

Actress Tabu: సీనియర్ నటి టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో మాత్రమే కాక తమిళ, హిందీ, మలయాళ చిత్రాలతో కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది టబు. 50 ఏళ్ళు దాటినా ఇప్పటి వరకూ పెళ్లి వైపు కూడా చూడని ఈ స్టార్ హీరోయిన్ పేరును గతంలో ఒకరిద్దరు హీరోలతో లింక్ చేశారు కానీ టబు మాత్రం అవి పట్టించుకోలేదు. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడుతూ వివాహం చేసుకోవాలి అన్నంత అవసరం ఏముందని తిరిగి ప్రశ్నించింది. పెళ్లి గురించి పిల్లల గురించి టబు సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంత వరకూ పెళ్లి ఎందుకు చేసుకోలేదు. అమ్మ అని పిలిపించుకోవాలి అనే ఆశ మీకు లేదా? అని అడగగా తల్లి కావడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ''తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే తల్లి కావచ్చు. లేదా సరోగసి ద్వారా కూడా తల్లి అవ్వచ్చు. నన్ను ఆపేవారు కూడా ఎవరు లేరు. పెళ్లి కాకపోయినా పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామా ఏంటి? అని టబు అందరి నోర్లు ముయించేసింది. ప్రస్తుతం తన సినిమా కెరీర్ ని యాక్టింగ్ ని తాను ఎంజాయ్ చేస్తూ గడిపేస్తున్నాను అని పేర్కొంది టబు.

Show Full Article
Print Article
Next Story
More Stories