'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'కు లైన్‌ క్లియర్‌

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు లైన్‌ క్లియర్‌
x
Highlights

దివంగత సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ తెలంగాణ హైకోర్టు...

దివంగత సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్రపై వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాల విడుదల నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.ఈ రెండు సినిమాలను ఎన్నికల సమయంలో విడుదల చేయొద్దంటూ సత్యనారాయణ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు వెల్లడించింది.రెండు సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో సినిమా విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ తెలియచేశారు. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలుగకుండా తెలంగాణ పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారని చెప్పారు. తెలంగాణలో సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ను ముందుగా ఈ నెల 22న రిలీజ్‌కు ప్లాన్‌ చేసినా నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యం కావటంతో 29న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. లక్ష్మీస్‌ వీరగ్రంథం కూడా మార్చి 22నే రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories