మాస్ పాట కోసం ముహూర్తం పెట్టిన "సర్కారు వారి పాట" బృందం

Sarkaru Vaari Paata Movie Team is Planning a Surprise for Mahesh Babu Fans in March
x

మాస్ పాట కోసం ముహూర్తం పెట్టిన "సర్కారు వారి పాట" బృందం 

Highlights

మార్చి లో మహేష్ బాబు అభిమానులకి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న "సర్కారు వారి పాట" టీం

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే విడుదలైన "కళావతి" పాట కి ఇంటర్నెట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అభిమానుల కోసం చిత్రబృందం కూడా మరిన్ని సర్ప్రైజ్ లను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి ఒక సాంగ్ ని కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా థమన్ సంగీతాన్ని అందించిన ఒక మాస్ సాంగ్ ను విడుదల చేయనున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రేజీ ట్రాక్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ పాటని మార్చి 8న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది మేలో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories