Sankranthiki Vasthunam OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Sankranthiki Vasthunam OTT Release in ZEE5 App
x

Sankranthiki Vasthunam OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Highlights

Sankranthiki Vasthunam OTT Release: వెంకటేష్‌ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ జంటగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Sankranthiki Vasthunam OTT Release: వెంకటేష్‌ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌ జంటగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అనిల్‌రావిపూడి దర్శకత్వం, వెంకటేష్‌ కామెడీ టైమింగ్ ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ సంక్రాంతి బరిలో అసలైన విజేతగా నిలిచింది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

కామెడీ ఓరియెంట్‌డ్‌గా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో భారీ కలెక్షన్లను రాబట్టింది. గేమ్‌ ఛేంజర్‌ టాక్‌తో డీలా పడ్డ దిల్‌రాజుకు ఈ సినిమా బూస్ట్‌ను ఇచ్చిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్లు కలెక్ట్‌ చేసి రికార్డులను సృష్టించింది. నాన్‌ పాన్‌ ఇండియా జాబితాలో సంక్రాంతికి వస్తున్నాం కొత్త రికార్డును సృష్టించిందని చెప్పాలి.

ఇదిలా ఉంటే థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. మంచి ధరకే ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. శివరాత్రి కానుకగా సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories