తెలుగులో మరో ఆఫర్ అందుకున్న మలయాళం బ్యూటీ

Samyuktha Menon Received another Movie offer in Telugu | Telugu Movie News Today
x

మరొక తెలుగు సినిమా అందుకున్న సంయుక్త మీనన్

Highlights

మరొక తెలుగు సినిమా అందుకున్న సంయుక్త మీనన్

Samyuktha Menon: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న "భీమ్లా నాయక్" సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించబోతోంది నిత్య మీనన్. అయితే మరొక హీరోయిన్ కోసం ఇప్పటికే చాలా మందిని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు కానీ ఎవరూ ఫైనలైజ్ కాలేదు. ఇక ఇద్దరు ముగ్గురు రిజెక్ట్ చేశాక ఎట్టకేలకు ఆ పాత్రకి సంయుక్త మీనన్ ఎంపికైంది.

ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ పర్ఫామెన్స్ చూసి బాగా నచ్చడంతో ఆమెనీ మరొక సినిమా కోసం లైన్ లో పెట్టారు నిర్మాతలు. ధనుష్ హీరోగా నటిస్తున్న "సార్" సినిమా కోసం ఈమెను హీరోయిన్గా ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. వెంకీ అట్లూరి కి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్ వారు నిర్మిస్తున్నారు. ఇక నిర్మాతల కంటే ఎక్కువగా ఆమె నటన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాగా నచ్చిందని అందుకే ఆమెని మరొక సినిమా కోసం రికమెండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories