సంపూ కొత్త సినిమా షురూ

సంపూ కొత్త సినిమా షురూ
x
Highlights

హృదయకాలేయం సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో సంపూర్ణేష్ బాబు.. మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న

హృదయకాలేయం సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో సంపూర్ణేష్ బాబు.. మొదటి సినిమాతో అందరిని ఆకట్టుకున్న సంపూని అందరు బ‌ర్నింగ్ స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటారు.. ఈ సినిమా తర్వాత సంపూ చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.. ఇక గత ఏడాది చేసిన కొబ్బరిమట్ట సంపూని మళ్లీ కం బ్యాక్ అనిపించింది.

ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరో సినిమాని మొదలు పెట్టాడు సంపూ..ఎన్‌.హరిబాబు ద‌ర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. సంతనూతలపాడులోని కృష్ణసాయి గ్రానైట్‌ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ సినిమాలో సంపూ సరనస కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తుంది.

పృథ్వీ , షియాజీ షిండే, కత్తి మహేష్‌, తనికెళ్ల భరణి, సుధాతో పాటు పలువురు నటినటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సీనియర్ రచయిత మరుదూరి రాజా మాటలు అందిస్తుండగా, కెమెరామెన్‌గా అడుసుమల్లి విజయ్‌కుమార్, ఎడిటింగ్‌ గౌతమ్‌రాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా అలవలపాటి శేఖర్, నిర్మాతలుగా ఎస్‌ శ్రీనివాసరావు, నారాయణ, చిరంజీవి వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories