OTT Movie: ఓటీటీలో సందడి చేస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌.. ట్రెండింగ్‌లో సమ్మేళనం..

Sammelanam Movie Trending in ETV Win
x

OTT Movie: ఓటీటీలో సందడి చేస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌.. ట్రెండింగ్‌లో సమ్మేళనం..

Highlights

OTT Movie: ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి.

OTT Movie: ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది.

ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా తరుణ్ మహాదేవ్ తెరకెక్కించిన సిరీస్ ‘సమ్మేళనం’. ప్రస్తుతం ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. రిలీజ్ నాటి నుండి ఇప్పటివరకు ఈ సినిమా 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ తో దూసుకెళుతోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచాడు.

ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లీన్ సిరీస్‌కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories