బిగ్ బాస్ ఒక్క ఎపిసోడూ చూడలేదు..మామగారు చెప్పారని చేశా..సమంత!

బిగ్ బాస్ ఒక్క ఎపిసోడూ చూడలేదు..మామగారు చెప్పారని చేశా..సమంత!
x
Highlights

గత ఆదివారం బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వచ్చిన సమంత తనసలు బిగ్ బాస్ లో ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని చెప్పి షాక్ ఇచ్చారు.

బిగ్ బాస్ షో 55 రోజులుగా అందర్నీ అలరిస్తూ వస్తోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రతి శని ఆది వారాలు ప్రత్యెక ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే, నాగార్జున ఇటీవల తన తాజా చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మనాలి వెళ్లారు. దాంతో గత ఆదివారం తన కోడలు సమంత అక్కినేని కి బిగ్ బాస్ ఇంటి బాధ్యత అప్ప చెప్పారు. ఇంకేముంది.. సమంత అభిమానుల్లో ఆనందం. ఇక పోయిన వారం దసరా కూడా కావడంతో సమంత తో ఏకంగా మూడుగంటల పాటు ఎపిసోడ్ రన్ చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. ఇక ఆ ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
నిజానికి సమంత ఎప్పుడు హోస్ట్ గా చేయలేదు. మొదటి సారి హోస్ట్ గా చేయాల్సి వచ్చినా.. తెలుగు మాట్లాడటం కొంచెం కష్టం అయినా.. మూడు గంటల ఆ ఎపిసోడ్ ను ముచ్చటగా ముందుకు తీసుకుపోయింది. అయితే, అదే ఎపిసోడ్ లో కొంత సేపు అక్కినేని అఖిల్ కనిపించి మెరిపించారు. అకస్మాత్తుగా జబర్దస్త్ హైపర్ ఆది ప్రత్యక్షమై చివర్లో ఎపిసోడు కు మంచి ఊపు తీసుకు వచ్చాడు. ఈ హంగుల మధ్యలో సమంత బాగానే నెట్టుకొచ్చింది.
తన బిగ్ బాస్ అనుభవాలను సమంత ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నిజాయతీగా ప్రకటన చేశారు. నేను అప్పటివరకూ బిగ్ బాస్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు అంటూ నిజాన్ని చెప్పేశారు. కేవలం మామగారు చెప్పారు కాబట్టి హోస్ట్ గా చేశాను అని సమంత చెప్పారు. అధీ కాకుండా మరో రెండు కారణాలతో హోస్ట్ గా చేశానని తెలిపారు సమంత . అవేమితంట్.. తనకు తెలుగు సరిగా రాదనీ.. అయినా తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ నేర్చుకున్తున్నననీ చెప్పారు. అయితే, తను తెలుగులో మాట్లాడటానికి కావలసిన ధైర్యం బిగ్ బాస్ హోస్టింగ్ ఇస్తుందని వచ్చాను అన్నారు. అదీకాకుండా హోస్టింగ్ అంటే తెలీని తనకు హోస్టింగ్ చేయడమేలానో నేర్చుకోవాలని బిగ్ బాస్ హోస్ట్ గా చేసినట్టు వివరించారు. మొత్తమ్మీద..ఒక్క ఎపిసోడ్ కూడా చూడకుండానే.. అవినాష్..అరియనాల మధ్య పులిహోర గురించి మాట్లాడారు..అభి..అఖిల్..మోనాల్ ముక్కోణం గురించీ చర్చించారు. బిగ్ బాస్ టీం సమంతకు అదిరిపోయే ట్రైనింగ్ ఇచ్చినట్టే మరి.
ఇక ఈవారం మళ్ళీ నాగార్జున వచ్చేస్తున్నారు. సో..సమంత ఇక బిగ్ బాస్ హౌస్ బాధ్యతలను మళ్ళీ మామగారికి అపచేప్పేసింది. నిజానికి నాలుగు రోజుల క్రితం సమంత ఈ వారం కూడా బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తారని చెప్పుకున్నారు. అయితే, దానికి ఆమె విముఖత చూపించారని వార్తలు వచ్చాయి. కొత్త హోస్ట్ వస్తారని అనుకున్నారు. అయితే, తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగార్జున వచ్చేశారు. సో..ఈరోజు ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తారు. అన్నట్టు దివి పోయిన వారం బయటకు వచ్చింది కానీ..ఆమె బయటకు వచ్చిన తరువాత స్టేజి మీద మాట్లాడింది లేదు. ఈరోజు నాగార్జున తో పాటు దివి కూడా స్టేజి మీద కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories