సమంత బాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదేనా?

Samantha to Make Her Bollywood  Film Debut with Ayushmann Khurrana
x

సమంత బాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదేనా?

Highlights

Samantha: ఆయుష్మాన్ ఖురానా సినిమాతో హిందీలో అడుగుపెట్టనున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమంత హిందీలో పలు ప్రాజెక్టులకు సైన్ కూడా చేసింది. అందులో ఒక వెబ్ సిరీస్ కి కూడా కమిట్మెంట్ ఇచ్చేసింది సామ్. తాప్సీ నిర్మాణంలో కూడా సమంత ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సమంతా కి బాలీవుడ్లో డెబ్యూ మూవీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందే సమంత మరొక హిందీ సినిమాకి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఆయుష్మాన్ ఖురానా సరసన సమంత హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడాల్సి ఉంది. తాజాగా ఈ సినిమాలో సమంత పాత్ర గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో సమంత ద్విపాత్రాభినయం చేయబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలోని రెండు పాత్రలు వేటికవే ప్రత్యేకం గా ఉంటాయని కచ్చితంగా ఈ సినిమా సమంతకి బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చి పెడుతుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట. ఇక ఆయుష్మాన్ ఖురానా సరసన సమంత ని చూడటానికి కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సమంతకి డ్యూయల్ రోల్ చేయటం ఇదే మొదటిసారి అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories