The Family Man 2 : నో వన్ సేఫ్.. రిలీజ్ డేట్ చెప్పేసిన స‌మంత‌

The Family Man 2 : నో వన్ సేఫ్.. రిలీజ్ డేట్ చెప్పేసిన స‌మంత‌
x
Highlights

టాలీవుడ్ అగ్రకథానాయక సమంత తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది.

టాలీవుడ్ అగ్రకథానాయక సమంత తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. సమంత హౌస్ట్ గా.. ఆహా ఫ్లాట్ ఫార్మ్ పై వస్తున్న సామ్ జామ్ మంచి సక్సెస్స్ ఫుల్ గా దూసుకెళ్తుంది. తాజాగా హిందీలో విజయవంతమైన 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కు సిక్వెల్ గా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' రాబోతుంది. అయితే ఈ సిరీస్ లో సమంత నటించింది. అయితే ఆమె నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 12నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సిరీస్‌ అలరించనుంది. ఇందులో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు మనోజ్‌బాజ్‌పాయ్‌ ప్రధానపాత్రలో కనిపించనున్నాడు. థ్రిల్లర్‌ కాన్సెప్టుతో వస్తున్న ఈ సిరీస్‌లో సమంత కీలక పాత్ర పోషించింది.

2019‌లో సెప్టెంబర్లో విడుదలైన 'ఫ్యామిలీ మ్యాన్' ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దానికి కొనసాగింపుగా 'ఫ్యామిలీ మ్యాన్‌2'ను తీసుకురావాలని దర్శక-నిర్మాతలు భావించారు. కాగా.. ఇందులో సమంత మునుపటి గ్లామరస్‌ పాత్రలతో పోలిస్తే పూర్తి భిన్నంగా కనిపించనుంది. ఈ సిరీస్‌ రాజ్‌, డీకే దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే తనకు మొదటి వెబ్‌సిరీస్‌ కావడంతో సమంత చాలా కష్టపడి పనిచేసిందట. ఇందులో ప్రియమణి, షరీబ్ హష్మి, దర్శన్ కుమార్, శరద్ కేల్కర్, సీమా బిస్వాస్ కీలక పాత్రలు పోషించారు. ఈ 'ఫ్యామిలీ మ్యాన్‌2'సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో టీజ‌ర్ రిలీజ్ చేయ‌గా, దానిని స‌మంత షేర్ చేస్తూ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories