Samantha: అల్లు అర్జున్ కు షాక్ ఇచ్చిన సమంత

Samantha Tells Allu Arjun that I Will Trust You Forever | Telugu Movie News
x

నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్ముతాను అంటున్న సమంత

Highlights

Samantha: నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్ముతాను అంటున్న సమంత

Samantha: స్టార్ బ్యూటీ సమంత తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ కోసం ఐటమ్ సాంగ్ చేసింది. "ఊ అంటావా ఊ ఊ అంటావా" అంటూ అల్లు అర్జున్ తో సమానంగా తన స్టెప్పులతో అదరగొట్టింది. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ పాట తో మరింత పెరిగిందని స్టార్ హీరోలు మరియు డైరెక్టర్లు అందరూ సమంత ని తమ సినిమాల కోసం ఎంపిక చేసుకోడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇక తెలుగులో మాత్రమే కాక ఇతర భాషల్లో కూడా సమంత క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది. ఇప్పటికే "కాతు వాకుల రెండు కాదల్" అనే తమిళ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన సమంత ఒక హాలీవుడ్ సినిమా చేసేందుకు సైన్ చేసినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు "ఊ అంటావా ఊ ఊ అంటావా" పాట యూట్యూబ్లో టాప్ 100 మ్యూజిక్ వీడియో లలో తొలి స్థానంలో ఉండటం గమనార్హం. పుష్ప థాంక్స్ మీట్ సందర్భంగా అల్లుఅర్జున్ స్వయంగా సమంతకు కృతజ్ఞతలు చెప్పారు. నన్ను నమ్ము అని ఒక్క మాట చెప్పగా సమంత వెంటనే ఒప్పుకుందని మరో ప్రశ్న కూడా వేయలేదని అది తన మనసుని తాకింది అని చెప్పారు బన్నీ. ఇక ఈ పాట ప్రపంచంలోనే నెంబర్ వన్ సాంగ్ గా నిలవటం మామూలు విషయం కాదని అన్నారు. ఈ నేపథ్యంలో సమంత "నేను మిమ్మల్ని ఎప్పటికీ నమ్ముతాను" అంటూ జవాబిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories