సమంత ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్!

సమంత ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్!
x

సమంత ఫ్యాన్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్!

Highlights

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 15 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఆమె, ఎన్నో సినిమాల్లో తన ప్రతిభను చాటారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు 15 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఆమె, ఎన్నో సినిమాల్లో తన ప్రతిభను చాటారు.

వివాహం, విడాకులు, అనారోగ్య సమస్యలు వంటి వ్యక్తిగత జీవిత సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సమంత మాత్రం తన ప్రొఫెషనల్ కెరీర్‌ను ఆపకుండా ముందుకు సాగిస్తున్నారు. ప్రస్తుతం నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగా కూడా క్రియాశీలంగా ఉన్నారు.

ఇటీవల నిర్మాతగా మారిన సమంత, తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ప్రతీ ఏడాది కనీసం రెండు సినిమాల్లో నటించాలన్నది ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఆమె ప్రధానంగా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేయనున్నట్టు టాక్.

సమంత తీసుకున్న ఈ స్ట్రాంగ్ డెసిషన్ ఆమె ఫ్యాన్స్‌కి చక్కటి సందేశాన్ని ఇస్తోంది. ఆ క్రమంలో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తెగ సెలబ్రేట్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories