Samantha: మళ్లీ ప్రేమలో పడిన సమంత.. ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

Samantha Ruth Prabhu In Love Again
x

మళ్లీ ప్రేమలో పడిన సమంత.. ఇంతకీ అతను ఎవరో తెలుసా..?

Highlights

హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడినట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. .

Samantha: హీరోయిన్ సమంత మళ్లీ ప్రేమలో పడినట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. వాలంటైన్స్ డే సందర్భంగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో సామ్ మళ్లీ ప్రేమలో పడిందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఓ వ్యక్తితో డ్రింక్ తాగుతున్నట్టు, పూలు వికసించిన ఫొటోలు షేర్ చేసింది సమంత, అంతేకాకుండా దీనికి లవ్ సింబల్‌ను కూడా జోడించింది. ఫ్యామిలీమ్యాన్ సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత లవ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా పుకార్లు సికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరూ నోరు మెదపలేదు. ఇప్పుడు తాజాగా సమంత పోస్టులో ప్రేమలో ఉన్నట్టు టాక్ నడుస్తోంది.

చైతూతో విడాకుల తర్వాత రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ అయింది. ఇద్దరు చెట్టపట్టాలేసుకుని తిరగడం వీరి డేటింగ్ పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్టైంది. తిరుపతి జిల్లాకు చెందిన రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లైంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన రాజ్ పై ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ తన ఫ్రెండ్‌ కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్ ఫిల్మ్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదటగా షాదీ అనే షార్ట్ ఫిలింను తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాగా ఫేమస్ అయ్యారు. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నుంచి రాజ్, సమంత మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల వీరి కాంబోలో వచ్చిన సిటాడెట్ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కూడా మంచి హిట్ అయింది. చైతూతో డివోర్స్, మయోసైటీస్ వంటి సమస్యల.. ఆ తర్వాత తన తండ్రిని కోల్పోవడం ఇలా వరస సమస్యలతో సమంత చాలా సతమతమయ్యారు. చైతుతో విడాకులు, అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవల మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టారు. వెబ్ సిరీస్‌ల్లో కూడా రాణిస్తున్నారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం, రక్త్ బ్రహ్మాండ్ వంటి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories