Samantha: జీవితం నేర్పిన పాఠం అదే.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

Samantha Opens Up on Life Lessons, Film Career and Future Plans with fans in Instagram
x

Samantha: జీవితం నేర్పిన పాఠం అదే.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు..!

Highlights

Samantha: సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణించిన సమంత గత కొన్ని రోజులుగా కష్ట సమయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

Samantha: సౌత్‌ ఇండస్ట్రీలో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణించిన సమంత గత కొన్ని రోజులుగా కష్ట సమయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. విడాకులు వెంటనే మయోసైటిస్‌ వ్యాధి ఇలా సమంత తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది. అయితే ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రిపేర్‌ అవుతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారిలో నటి సమంత ఒకరు. నిత్యం అభిమానులతో టచ్‌లో ఉండే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో బెస్ట్‌ హీరోయిన్‌ ఎవరని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సామ్‌ సమాధానం ఇస్తూ.. పార్వతీ తిరువోతులో ఉల్లొళుక్కు, సాయి పల్లవి (అమరన్‌), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్‌ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్‌ఎల్‌), దివ్య ప్రభ (ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌). వీరంతా రాక్‌స్టార్స్‌. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మరో వీడియో చేస్తా అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇక జీవితం ఇటీవల మేకు నేర్పిన పాఠం ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఈ మధ్య కొన్ని రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నా. మొబైల్‌ లేకపోవడంతో మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. దానికి ఎంతగా అడిక్ట్‌ అయ్యామో అర్థమైందని చెప్పుకొచ్చింది. ఇక సినిమాల్లో తిరిగి వచ్చేయండి, మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అంటూ ఓ అభిమాని అడగ్గా.. తప్పకుండా మళ్లీ తిరిగొస్తా బ్రో అంటూ సమాధానం ఇచ్చింది.

అలాగే నెగెటివ్‌ ఆలోచనలను ఎలా అధిగమిస్తుంటారంటూ ఓ అభిమాని ప్రశ్నించగా.. దాని కోసం ప్రత్యేకంగా ఏమీ చేయనని, రెగ్యులర్‌గా చేసే మెడిటేషన్‌ తదితర వాటి వల్ల నెగెటివిటీ దూరం అవుతుందనుకుంటున్నా అని తెలిపింది. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. మరి సమంతకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories