ఓ బేబీ ట్రైలర్‌... 70 ఏళ్ల పడుచుపిల్లగా సమంత ఆదరగోట్టింది ..

ఓ బేబీ ట్రైలర్‌... 70 ఏళ్ల పడుచుపిల్లగా సమంత ఆదరగోట్టింది ..
x
Highlights

అక్కినేని సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి కమర్షల్ సినిమాలతో పాటు కధకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తుంది .. అలాంటి పాత్రలను చేసి నటిగా...

అక్కినేని సమంత సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి కమర్షల్ సినిమాలతో పాటు కధకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తుంది .. అలాంటి పాత్రలను చేసి నటిగా ఎంతో గుర్తింపు పొందింది సమంత .. అయితే తాజాగా సమంత చేస్తున్న తాజా చిత్రం ఓ బేబీ.. దీనికి సంబంధించిన ట్రైలర్‌ని నిన్న విడుదల చేసింది చిత్రబృందం.. ఇందులో 70 ఏళ్ల ముసలామె లాగా సమంత నటిస్తుంది . ఒక వరైటీ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇందులో సమంత పాత్రే కీలకం. దీనికి నందినిరెడ్డి దర్శకురాలు ..ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 5 న రిలీజవుతోంది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'‌కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా రిలీజై... దుమ్మురేపుతోంది. ఇప్పటికే రిలీజైన సాంగ్ ప్రోమోస్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాగ శౌర్య, లక్ష్మీ, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ కలిసి ఈ సినిమాను రూపొందిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories