సమంత మరియు నాగచైతన్య మధ్య క్లాష్

Samantha Naga Chaitanya Movies will Be Released Simultaneously
x

సమంత మరియు నాగచైతన్య మధ్య క్లాష్ 

Highlights

*సమంత మరియు నాగచైతన్య మధ్య క్లాష్

Naga Chaitanya Vs Samantha: స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న "యశోద" సినిమా టైటిల్ గ్లింప్స్ ఈ మధ్యనే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. తాజాగా ఈ సినిమాని ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్లుగా దర్శక నిర్మాతలు ప్రకటించారు. హరి మరియు హరీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరోవైపు సమంత మాజీ భర్త నాగచైతన్య కూడా హిందీలో అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న "లాల్ సింగ్ చద్దా" సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కాబోతోంది. అద్వైత్ చందన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.చూస్తూ ఉంటే సమంత మరియు నాగచైతన్య ఇద్దరు నటించిన సినిమాలు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకే సమయంలో విడుదల కాబోతున్నాయి. గతంలో సమంత హీరోయిన్గా నటించిన "యూటర్న్" మరియు నాగచైతన్య హీరోగా నటించిన "శైలజ రెడ్డి అల్లుడు" సినిమాలు 2018లో సెప్టెంబర్ 13న ఒకే రోజున విడుదల అయ్యాయి.

ఆ సమయంలో అది సమంత వర్సెస్ నాగచైతన్య కాదని సమంత మరియు నాగచైతన్య అని చెప్పుకొచ్చింది సమంత. మరి ఇప్పుడు విడాకుల తర్వాత సమంత ఏమంటుందో వేచిచూడాలి. మరోవైపు అఖిల్ హీరోగా నటిస్తున్న "ఏజెంట్" కూడా ఆగస్టు 11న విడుదల కాబోతోంది. చూస్తూ ఉంటే అక్కినేని బ్రదర్స్ తో సమంత కి బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాష్ అవ్వనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories