అప్పుడు నాగార్జున కోసం.. ఇప్పుడు అఖిల్ కోసం

అప్పుడు నాగార్జున కోసం.. ఇప్పుడు అఖిల్ కోసం
x
సమంత ఫైల్ ఫోటో
Highlights

అక్కినేని మూడోతరం కథానాయకుడిగా సినిమాల్లోకి వచ్చాడు హీరో అఖిల్.. హీరోగా చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి.

అక్కినేని మూడోతరం కథానాయకుడిగా సినిమాల్లోకి వచ్చాడు హీరో అఖిల్.. హీరోగా చేసిన మూడు సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తున్న ఈ సినిమాకి గోపి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు.

నిజానికి ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ స్క్రిప్టులో మార్పులు కారణంగా దర్శకుడు భాస్కర్ కొద్ది రోజులు టైమ్ తీసుకున్నాడు. ఇక హీరోయిన్ ఎంపిక కూడా ఆలస్యం అయింది. దీనితో సినిమా లేట్ గానే స్టార్ట్ అయి ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో అఖిల్ తండ్రిగా దర్శకుడు సముద్రఖనిని ఎంపిక చేశారు. ఈ సినిమతో పాటు సముద్రఖని బన్ని 'అల.. వైకుంఠపురములో..' మూవీలో విలన్‌గా నటిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి ఓ తాజా అప్డేట్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో సమంత కనిపించనున్నారని తెలుస్తోంది. వరుస విజయాలతో మంచి సక్సెస్ లో ఉన్న సమంత తనకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాడట అఖిల్.. బొమ్మరిల్లు సినిమాలో ఓ అమ్మాయి బైక్ పైన ఎక్కి తన కథంతా చెపుతాడు సిద్ధార్థ్.. ఇందులో కూడా అలాగే సమంతకి తన గతాన్ని చెబుతాడాట అఖిల్.. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

గతంలో నాగార్జున నటించిన మన్మధుడు 2 లో గెస్ట్ రోల్ లో కనిపించింది సమంత. ఇక సమంత విషయానికి వచ్చేసరికి స‌మంత ప్రస్తుతం శ‌ర్వానంద్‌తో 96 రీమేక్ చిత్రం చేస్తుంది. దీంతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories