Top
logo

Joseph Prabhu: సామ్ చై విడాకులపై సమంత తండ్రి రియాక్షన్

Samantha Father Joseph Prabhu Reaction on Naga Chaitanya Samantha Divorce Issue
X

సామ్ చై విడాకులపై సమంత తండ్రి రియాక్షన్(ఫైల్ ఫోటో)

Highlights

* విడాకుల విషయంలో సమంతని మరొకసారి ఆలోచించమని చెప్పా : సమంత తండ్రి

Joseph Prabhu: పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకున్నట్లు గా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత మరియు నాగచైతన్య విడిపోయారు అనే చేదు నిజాన్ని ఇప్పటికీ తన అభిమానులు నమ్మలేకపోతున్నారు. అభిమానులే ఇంత కృంగిపోతుంటే వారి కుటుంబ సభ్యులు ఇంకా ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సామ్ చై విడిపోవటం చాలా దురదృష్టకరమని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత మరియు నాగచైతన్య లవ్ విడాకులపై రియాక్ట్ అయ్యారు సమంత తండ్రి జోసెఫ్ ప్రభు.

"మొదటిసారి వారిద్దరు విడిపోతున్నారు అని తెలిసినప్పుడు నేను పూర్తిగా బ్లాక్ అయిపోయాను. నా మైండ్ పని చేయాలేదు. నాకు ఇంకేమి ఆలోచన కూడా రాలేదు. విడాకుల విషయంలో నా కూతురు సమంతని మరొకసారి ఆలోచించమని చెప్పాను" అని అన్నారు జోసఫ్ ప్రభు. అందరిలాగానే తను కూడా ఈ పరిస్థితి త్వరగా మారితే బాగుంటుందని అన్నారు. అయితే వీరిద్దరి విడాకులకు కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో చాలా పుకార్లు బయటకు వస్తున్నాయి కానీ ఈ జంట ఇంకా రియాక్ట్ అవలేదు.

Web TitleSamantha Father Joseph Prabhu Reaction on Naga Chaitanya Samantha Divorce Issue
Next Story