సమంతా కి కనీసం రెండు లక్షల ఫాలోవర్లు కూడా లేరా?

Samantha Fan Following Is Just 1.6 Lakhs
x

సమంతా కి కనీసం రెండు లక్షల ఫాలోవర్లు కూడా లేరా?

Highlights

Samantha: టాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంతా కూడా ఒకరు.

Samantha: టాలీవుడ్ లో మాత్రమే కాక సౌత్ ఇండస్ట్రీ మొత్తం మీద ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంతా కూడా ఒకరు. ఈ మధ్యనే పుష్ప సినిమాలు ఐటెం సాంగ్ లో బన్నీతో కలిసి స్టెప్పులేసిన సమంత ఆ పాటతో ఇంటర్నెట్లో తెగ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో సామ్ కు 21.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ లో కూడా 9.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సమంత కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఈ మధ్యనే ఎటువంటి హడావుడి లేకుండా యూట్యూబ్ లో కూడా అడుగు పెట్టి తనకంటూ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంది సమంత. అందులో చిన్న చిన్న షార్ట్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మొదటగా పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు తీసిన ఒక వీడియో ని యూట్యూబ్ లో పోస్ట్ చేశారు. దానికి 33,000 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. ఆ తర్వాత తన పెంపుడు కుక్క పిల్ల పుట్టినరోజు సందర్భంగా ఒక వీడియో ని పోస్ట్ చేసింది సమంత. ఇలా అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తున్న సమంత ఈ మధ్యనే ఒక మినీ ట్రావెల్ వ్లాగ్ కూడా చేసింది. ఎప్పటికప్పుడు మంచి వీడియోలు షేర్ చేస్తున్నప్పటికీ సమంతకి యూట్యూబ్ లో కేవలం 1.6 సబ్స్క్రైబర్లు మాత్రమే ఉండటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఎంత సమంత అయినా సరే యూట్యూబ్ లో ఫాలోవర్లు రావాలంటే కంటెంట్ కూడా ఇంపార్టెంట్ అని ఇలాంటివి చూస్తేనే అనిపిస్తూ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories