Samantha: నా ప్రేమ కథ ఎప్పటికీ ముగియదు.. సమంత ఎమోషనల్ పోస్ట్..

Samantha: ఇండస్ట్రీలో పన్నెండేళ్ళు పూర్తిచేసుకున్న సమంత

admin1
Published on: 26 Feb 2022 6:29 PM IST
Samantha Completes 12 Years In The Film Industry | Tollywood News
X

ఇండస్ట్రీలో పన్నెండేళ్ళు పూర్తిచేసుకున్న సమంత

Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ను హీరోయిన్ గా మార్చిన సినిమా "ఏ మాయ చేసావే". సమంత మాజీ భర్త నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమా విడుదలై ఇప్పటికీ పన్నెండేళ్ళు గడిచింది. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమంత ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. ఒక అందమైన ఫోటో ని షేర్ చేస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ట్లుగా తెలియజేసింది సమంత. "లైట్స్ కెమెరా యాక్షన్ మరియు వీటి చుట్టూ ఎన్నో మధుర జ్ఞాపకాలు అద్భుతమైన అనుభూతులకు పన్నెండేళ్లు" అని పోస్ట్ చేసింది సమంత.

"ఇలాంటి అద్భుతమైన జర్నీ మరియు నిస్వార్ధమైన అభిమానులు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు సినిమా కి మధ్య ఉండే ప్రేమ కథ ఎప్పటికీ పూర్తికాకూడదు" అని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇండస్ట్రీలో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు సమంతా పై శుభాకాంక్షలు వర్షం కురిపిస్తునన్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమాలో "ఊ అంటావా ఊ ఊ అంటావా" అని ఐటమ్ సాంగ్లో కనిపించిన సమంత త్వరలోనే గుణశేఖర్ డైరెక్షన్లో "శాకుంతలం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

admin1

admin1

Next Story