విజయ్ దేవరకొండ కోసం ఖుషి గా మారనున్న సమంత

విజయ్ దేవరకొండ కోసం ఖుషి గా మారనున్న సమంత
Kushi Movie: విజయ్ సమంత సినిమా టైటిల్ వెనుక కారణం ఇదేనా?
Kushi Movie: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తూ ఖుషి సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. మహానటి సినిమా తర్వాత మళ్లీ సమంత మరియు విజయ్ దేవరకొండ ఈ సినిమా తో జత కట్టనున్నారు. ఈ రోజు రోజుకి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ టైటిల్ తో ఏమాత్రం సంతోషంగా లేరు.
అయినా సరే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న శివ నిర్వాణ గతంలో తన "నిన్ను కోరి", "మజిలి" వంటి సినిమాలతో మెప్పించడం తో ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని కొందరు చెబుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ పెట్టడం వెనుక పెద్ద కారణం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో సమంత పాత్ర పేరు ఖుషి. అందుకే సినిమాకి కూడా అదే టైటిల్ ను ఖరారు చేసారు. నిజానికి 2001లో పవన్ కళ్యాణ్ మరియు భూమిక నటించిన "ఖుషి" సినిమాలో భూమిక పాత్ర పేరు "ఖుషి" కాదు.
అయితే ఈ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన హిందీ సినిమాలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది. అందులో ఆమె పాత్ర పేరు ఖుషి సింగ్. మరి ఇప్పుడు ఖుషి పాత్రలో సమంత ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
LIC: ప్రతిరోజు రూ.60 పొదుపుతో 13 లక్షలు సంపాదించండి..!
11 Aug 2022 2:30 PM GMTRamakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMT