Salman Khan: గాడ్ ఫాదర్ షూటింగ్ సెట్స్ కి సల్మాన్ ఖాన్ రాక అప్పుడేనా...

Salman Khan Shooting  for Chiranjeevi Godfather Movie begin in February | Tollywood News
x

Salman Khan: గాడ్ ఫాదర్ షూటింగ్ సెట్స్ కి సల్మాన్ ఖాన్ రాక అప్పుడేనా...

Highlights

Salman Khan: అప్పటి నుంచి గాడ్ ఫాదర్ షూటింగ్ కి రాబోతున్న సల్మాన్ ఖాన్

Salman Khan-Godfather: ఒకవైపు "ఆచార్య" సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి మరోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో "గాడ్ ఫాదర్" సినిమా తో కూడా బిజీగా ఉన్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడిగా వ్యవహరించిన మొట్టమొదటి సినిమా "లూసిఫర్" రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా రీమేక్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఎంట్రీ తో ఈ సినిమాకి బాలీవుడ్లో సైతం మార్కెట్ పెరుగుతుందని దర్శక నిర్మాతలు ఆశిస్తున్నారు.

ప్రస్తుతం మెహర్ రమేష్ తో "భోళా శంకర్", కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి సినిమాలతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే నెల నుంచి "గాడ్ ఫాదర్" సినిమా షూటింగ్ మళ్లీ మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి వెళ్లనుంది.

సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి రానున్నారు. ఎన్వీ ప్రసాద్ మరియు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories