Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు మెయిల్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు

Salman Khan Receives Threat Mail
x

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపు మెయిల్.. పోలీసులను ఆశ్రయించిన నటుడు

Highlights

Salman Khan: ఇటీవలి లారెన్స్ బిష్ణోయ్ ఇంటర్వ్యూని చూడాలని ఆదేశం.. లేకపోతే చూపించాల్సి వస్తుందని హెచ్చరిక

Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మరో వ్యక్తి రోహిత్ గార్గ్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరుతో బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చింది. లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలని.. లేదంటే చూసేలా చేయాల్సి వస్తుంది. ఖాన్ ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే, గోల్డీ భాయ్‌తో ముఖాముఖి మాట్లాడాలి అనేది సల్మాన్ కు వచ్చిన ఈ మెయిల్ సారాంశం.

సల్మాన్ ఖాన్‌కు తాజా బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం ముంబై పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహిత మిత్రుడు ప్రమోద్ గుంజాల్కర్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సల్మాన్ ఖాన్‌కు, ఆయన తండ్రికి గతంలోనూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories